NANNAYA UNIVERSITY : రాజమహేంద్రవరంలోని ఆదికవి నన్నయ యూనివర్సిటీలో అనేక అక్రమాలు, అవినీతి జరిగాయని.. ఇందులో సిబ్బందితో పాటు వీసీ, రిజిస్ట్రార్‌కు ప్రమేయం ఉందని ఆ యూనివర్సిటీ మాజీ ప్రత్యేక అధికారి ఎ.ఎస్.వి.ఎస్. సాంకృత్యాయన్ ఆరోపించారు. దీనికి సంబంధించిన అనేక ఆధారాలు తన వద్ద ఉన్నాయని.. ప్రభుత్వం విచారణ చేసి చర్యలు తీసుకోవాలని కోరారు. మొక్కా జగన్నాథరావు.. వైస్ ఛాన్సలర్‌గా జాయిన్ అయినప్పటి నుంచి నేటి వరకు యథేచ్ఛగా కోట్ల రూపాయలను దోచుకున్నారని ఆరోపించారు.
432 అనుబంధ కళాశాలల విద్యార్థులకు చెందిన పరీక్ష ఫీజులు, సర్టిఫికెట్లు, మార్కుల మెమో ఫీజులు, డీడీలను క్లోనింగ్ చేశారన్నారు. ఆన్లైన్ విధానంలో పేమెంట్ చేయకుండా కోట్లు గడించారని.. ప్రభుత్వానికి రావాల్సిన డబ్బులను తన సొంత ఖాతాకు మళ్లించారని ఆరోపించారు. ఈ అవినీతిలో అనేకమంది పాత్ర ఉందని,.. వారందరి వివరాలను ప్రభుత్వానికి అందిస్తామన్నారు. విచారణ చేపట్టి అవినీతి సొమ్మును.. ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: