రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు తరలించారు. నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని ఓ హత్య కేసులో పోలీసులు గత శుక్రవారం అరెస్టు చేశారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో హైకోర్టు న్యాయవాది శివారెడ్డి ఇంటి వద్ద ఉన్న సమయంలో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెండు నెలల క్రితం రామకృష్ణారెడ్డి బావ సత్తిరాజురెడ్డి అనుమానాస్పద మృతి కేసులో అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మెుదట ఆయనను కాకినాడ సబ్ జైలు తరలించారు. ఇవాళ అక్కడి నుంచి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తరలించారు.
అక్రమాలపై ప్రశ్నించినందుకే అరెస్టు
రామకృష్ణారెడ్డి అరెస్టు రాష్ట్ర ప్రభుత్వ అరాచకానికి పరాకాష్ట అని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య అన్నారు. అక్రమాలపై ప్రశ్నించినందుకే రామకృష్ణారెడ్డిని అరెస్టు చేశారని మండిపడ్డారు. సహజ మరణమని నిర్ధారణైనా అరెస్టు చేయడం దారుణమని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: వైకాపా నేతల అక్రమాలకు ఏపీలోని జైళ్లు సరిపోవు: ధూళిపాళ్ల