కరోనా వైరస్ నియంత్రణపై వైద్య సిబ్బంది అప్రమత్తమవుతోంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని చర్యలను చేపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినందున జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
అనుమానితుల నుంచి శాంపిల్స్ సేకరించి నిర్థరణ పరీక్షలకు పంపామని జిల్లా ఆస్పత్రులు అధికారి డా.రమేష్ కిషోర్ తెలిపారు. కరోనా సోకిన ఇద్దరిలో ఒకరు కోలుకుంటున్నారని చెప్పారు. అయితే బాధితుల కుటుంబ సభ్యులను రాజమహేంద్రవరంలోని జిల్లా ఆస్పత్రిలో ఉంచామని వెల్లడించారు.
ఇదీ చదవండి :