పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం కోసం రాజమహేంద్రవరంలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం భూమిని ఇవ్వాలని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రెవెన్యూ అధికారులు విశ్వవిద్యాలయానికి ఉత్తర్వులు అందజేశారు. 1985లో తెలుగు సాహిత్య పీఠం పేరిట ఏర్పాటైన సంస్థకు 45 ఎకరాలు కేటాయించారు. వీటిలో 25 ఎకరాలు ఆయా సంస్థలకు కేటాయించారు. ప్రస్తుతం ధవళేశ్వరం పంచాయతీ రెవెన్యూ పంచాయతీ పరిధిలో తెలుగు విశ్వవిద్యాలయం నడుస్తోంది. వీటిలో ఆరున్నర ఎకరాల్లో భవనాలు ఉన్నాయి. పదమూడున్న ఎకరాల్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదు. అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది 14 మంది ఉండగా...10 విద్యార్థులు ఉన్నారు. కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులతో అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.
ఇవీ చదవండి...నర్సీపట్నం ఆర్డీవో కార్యాలయం ఎదుట భాజపా, జనసేన ఆందోళన