Minister Viswaroop procession: కోనసీమ జిల్లా అమలాపురం శాసనసభ్యుడు పినిపే విశ్వరూప్ రవాణా శాఖ మంత్రిగా బాధ్యతల స్వీకరణ అనంతరం నిన్న రాత్రి అమలాపురం ఊరేగింపుగా చేరుకున్నారు. మంత్రిగారి ఊరేగింపులో వైకాపా నాయకుడు, నగరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొమ్ముల కొండలరావు మంత్రి విశ్వరూప్‌కు పూలమాలలు వేసి నడిరోడ్డుపై కరెన్సీ నోట్లు విరజిమ్మిన సంఘటన విమర్శలకు దారి తీసింది. అనంతరం ఆ నోట్లను అక్కడే ఉన్న కార్యకర్తలు పోటీపడి మరీ ఏరుకున్నారు.
ఇదీ చదవండి : ఆ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఎందుకు ఇవ్వలేదు: జీవీఎల్