తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం అంతర్వేది దేవస్థానం బీచ్ రోడ్డులో గల్ఫ్ నుంచి వచ్చిన ఒక వ్యక్తికి కరోనా స్ట్రెయిన్-2 సోకినట్లు రామేశ్వరం పీహెచ్సీ వైద్యాధికారి యోనస్ తెలిపారు. పది రోజుల కిందట విదేశాల నుంచి వచ్చిన ఆ వ్యక్తిని హైదరాబాద్ విమానాశ్రయంలో పరీక్షించారు. అతని కుటుంబీకులు, స్థానికులకు 20 మందికి నిర్దారణ పరీక్షలు చేయగా అందరికీ నెగిటివ్ వచ్చిందని ఆయన వెల్లడించారు.
ఇదీ చదవండి: తిరుపతి ఉపపోరులో హోరెత్తిన ప్రచారం