తూర్పుగోదావరి జిల్లాలో పాజిటివ్ కేసు నమోదు కావడంపై వైద్య ఆరోగ్య సిబ్బంది, అధికారులు అప్రమత్తమయ్యారు. లండన్ నుంచి వచ్చిన యువకుడికి పాజిటివ్ అని తేలడంపై.. అతడితో పాటు కుటుంబీకులు, మరి కొందరు అనుమానితులను కాకినాడ ఆస్పత్రిలో చేర్పించారు. ఐసోలేషన్ వార్డులో పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి నివారణకు చేపట్టిన చర్యలను జిల్లా వైద్య సేవల సమన్వయ అధికారి రమేష్ కిషోర్ ఈటీవీ భారత్ తో పంచుకున్నారు.
ఇవీ చదవండి: