తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం మూలస్థానం అగ్రహారానికి కేంద్ర ప్రభుత్వం 'చైల్డ్ ఫ్రెండ్లీ అవార్డు'ను అందించింది. కేంద్ర ప్రభుత్వం పలు రంగాల్లో అభివృద్ధి చెందిన గ్రామ పంచాయతీలకు ఇలాంటి పురస్కారాలను అందిస్తుంది. 'నేటి బాలలే- రేపటి పౌరులు' అనే స్ఫూర్తితో మూలస్థానం గ్రామ ప్రజలంతా శ్రమించిన తీరుకు ఈ ఫలితం దక్కింది.
చిన్నారులెవరూ పనికి వెళ్లకుండా పాఠశాలలో చదువుకునేలా వారంతా శ్రమించారు. అధికారులతో సమన్వయం చేసుకుని గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపారు. గుర్తించిన కేంద్ర ప్రభుత్వం.. ఈ అవార్డుకు గ్రామాన్ని ఎంపిక చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో.. పురస్కారాన్ని కొరియర్లో గ్రామానికి కేంద్రం పంపినట్టు ఎంపీడీవో ఝాన్సీ తెలిపారు. పంచాయతీ కార్యదర్శి రేణుకకు ఈ పురస్కారాన్ని అందించారు.
ఇదీ చదవండి: