ETV Bharat / city

కాల్వలోకి కారు... ఇద్దరు మహిళలతోపాటు కడుపులో శిశువు మృతి - car fall in water at kammam district

కాల్వలోకి కారు దూసుకెళ్లింది. ఇద్దరు మహిళలు కారులోనే మృతి చెందారు. అందులో ఓ మహిళ గర్భిణీ. ఆమెకు ఆపరేషన్ చేసి.. మృత శిశువును వైద్యులు బయటికి తీశారు.

కాల్వలోకి కారు... గర్భిణీ మృతి, కడుపులో శిశువు క్షేమం
author img

By

Published : Sep 22, 2019, 5:47 PM IST

కాల్వలోకి కారు... ఇద్దరు మహిళలతోపాటు కడుపులో శిశువు మృతి

తెలంగాణలోని ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెం వద్ద సాగర్‌ కాల్వలోకి కారు దూసుకెళ్లింది. ఓ వ్యక్తి దూకేయడంతో క్షేమంగా బయట పడ్డాడు. మహిళలు ఇద్దరు మాత్రం కారులోనే ఇరుక్కుపోయారు. స్థానికులు బయటికి తీయగా అప్పటికే చనిపోయారు. వారిని ఖమ్మం ప్రభుత్వ ప్రధానాస్పత్రికి తరలించారు. అందులో ఓ మహిళ గర్భిణీ. వైద్యులు ఆపరేషన్ చేసి మృత శిశువును బయటికి తీశారు.

మృతులది మానుకోట...
మృతులది మహబూబాద్ జిల్లా చినగూడూరు మండలం జయ్యారం గ్రామం. మరణించిన పోగుల ఇందిర, పోగుల స్వాతి ఇద్దరూ అత్తాకోడళ్లే. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు బయట పడిన మహిపాల్ పేర్కొన్నారు. బహిర్భూమి కోసం పక్కన ఆపి, తర్వాత కారు వెనక్కు తీస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో భార్య, తల్లి, కొడుకు ముగ్గురినీ కోల్పోయిన మహిపాల్ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నాడు.

ఇవీచూడండి: జాతీయ రహదారిపై ప్రమాదం.. ఎమ్మెల్యే మానవత్వం

Chamoli (Uttarakhand), Sep 22 (ANI): At least three people died after the vehicle they were in, fell off Nijmula-Birahi road into a river in Chamoli on the night of September 21. One person is still missing. Search and rescue operation by the local administration and NDRF (National Disaster Response Force) is underway.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.