మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుతో ఉద్యమ పోరులో పాల్గొన్న శతాధిక వృద్ధుడు బీరబోయిన బాలు దొర (115) ఆదివారం ఆయన స్వగ్రామమైన రాజవొమ్మంగి మండలం కొండపల్లి గ్రామంలో మృతి చెందారు. బాలు దొర అల్లూరితో కలిసి ఆదివాసీల సమస్యలపై బ్రిటిష్ వారితో పోరాడారు. ముఖ్యంగా కొండపల్లి కేంద్రంగా 1924 మే 1 నుంచి 6వ తేదీ వరకు బ్రిటిష్ వారితో జరిగిన పోరాటంలో పాల్గొన్నాడు. తాను మన్యంలో ఉన్న అల్లూరికి భోజనం తీసుకెళ్లేవాడినని....ఆనాటి స్మృతులను, ఘట్టాలను, తమకు చెప్పేవారిని గ్రామస్థులు అంటున్నారు. వందేళ్ల వయసు పైబడిన బాలు దొర ఇటీవల అనారోగ్యానికి గురయ్యారు. స్వగ్రామమైన కొండపల్లిలో ఆదివారం మృతి చెందారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరయ్యారు.
ఇదీ చదవండి: