Brutal murder : తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి మండలం డి.వెలమలకోట గ్రామంలో బుడమల రాములమ్మ(39) అనే గిరిజన మహిళను.. సహజీవనం చేస్తున్న వ్యక్తి హతమార్చాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది.
పోలీసుల కథనం ప్రకారం..
డి.వెలమలకోట గ్రామానికి చెందిన రాములమ్మకు 12 ఏళ్ల క్రితం ఓ వ్యక్తితో వివాహమైంది. అయితే.. మూడేళ్ళ క్రితం వివిధ కారణాలతో విడిపోయారు. ఆ తర్వాత మూడేళ్ళ నుంచి భూసి గూడెం గ్రామానికి చెందిన సోమిరెడ్డితో రాములమ్మ సహజీవనం చేస్తోంది. అయితే.. రాములమ్మపై అనుమానంతో సోమిరెడ్డి తరచూ గొడవ పడేవాడు.
ఈనెల 14న వీరిరువురూ తాటికల్లు కోసం అటవీ ప్రాంతంలోకి వెళ్లారు. అక్కడ కూడా గొడవ జరగటంతో విచక్షణ కోల్పోయిన సోమిరెడ్డి.. రాములమ్మ తలపై రాయితో కొట్టి హతమార్చినట్టు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం సోమిరెడ్డి పరారీలో ఉన్నట్టు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: Drunker Attack on Conistable : మద్యం మత్తులో కానిస్టేబుల్ పై వ్యక్తి దాడి.. ఆ తర్వాత..?