ETV Bharat / city

కరోనా అనుమానితులు క్వారంటైన్​కు తరలింపు - కరోనా కేసులు న్యూస్

తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో ఎనిమిది మందికి కరోనా లక్షణాలు ఉండడంతో వారిని రాజమహేంద్రవరం క్వారెంటైన్​కు తరలించారు. అందులో నలుగురు దిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినట్లు గుర్తించారు.

కరోనా అనుమానితులను క్వారంటైన్​కు తరలింపు

author img

By

Published : Mar 31, 2020, 10:28 AM IST

Updated : Mar 31, 2020, 2:14 PM IST

కరోనా అనుమానితులు క్వారంటైన్​కు తరలింపు

తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం పెద్దపళ్లకు చెందిన నలుగురు వ్యక్తులు ఇటీవల దిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చారు. వీరికి కరోనా లక్షణాలు ఉండటంతో రాజమహేంద్రవరం క్వారంటైన్​కు తరలించారు. అలాగే... ఇటీవల దిల్లీ వెళ్లి వచ్చిన రాజమహేంద్రవరానికి చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. అతడి కుమారుడితోపాటు కోడలు, మనవడు, మనవరాలు కొత్తపేటలో నివసిస్తున్నారు. వారికి దగ్గు, జలుబు ఉన్నట్లు గుర్తించిన వైద్య సిబ్బంది వెంటనే వారిని 108లో రాజమహేంద్రవరం క్వారంటైన్​ తరలించారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో మరో ఇద్దరికి కరోనా​.. 23కి చేరిన కేసులు

Last Updated : Mar 31, 2020, 2:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.