ETV Bharat / city

Pigeon Viral: నెల్లూరులో తెల్ల పావురం కలకలం... భయాందోళనలో స్థానికులు

Pigeon Viral: మనకి సహజంగా తెల్లని పావురాన్ని చూస్తే ముచ్చెటేస్తుంది. కానీ అక్కడి ప్రజలకు దానిని చూస్తే భయం, ఆశ్చర్యం రెండు కలుగుతున్నాయి. ఎందుకంటే దాదాపు రెండు గంటలకు పైనే కపోతం అక్కడే ఉంది. దానిని పట్టుకోవడానికి వెళ్లిన వారికి అది చాాలా సులభంగా దొరికింది. ఒక్కసారి దానిని చూసి అక్కడి గ్రామస్థులు ఖంగుతిన్నారు. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే?

white Pigeon in nellore
నెల్లూరులో తెల్ల పావురం కలకలం
author img

By

Published : Mar 23, 2022, 7:35 AM IST

Pigeon Viral: నెల్లూరు జిల్లా కలవాయి మండలం కుల్లూరు గ్రామంలో చైనీస్‌ బార్‌కోడ్‌తో ఉన్న పావురం ఒకటి కలకలం రేపింది. బజారువీధిలో ఒక భవనంపై ఎక్కువ సమయం ఉన్న తెల్ల పావురాన్ని చూసి దాన్ని పట్టుకున్నామని యువకులు తెలిపారు. పావురం ఒక కాలికి బ్యాడ్జ్, మరో కాలికి చైనీస్‌ బార్‌ కోడ్‌ ఉంది. ఇది దేనికి సంబంధించింది ఉంటుందోనని తర్జనభర్జన పడ్డామని స్థానికులు అన్నారు.

చెన్నై, గూడూరు పరిసర ప్రాంతాలలో పావురాల పరుగు పందేలు నిర్వహించే వారి నుంచి ఇది తప్పించుకొని వచ్చిందేమోనని కొందరు యువకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు తెలిపామని గ్రామస్థులు చెప్పారు.

ఇదీ చదవండి:

RRR: థియేటర్​లో ఇనుప మేకులు, కంచెలు.. ఎందుకో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.