నెల్లూరు జిల్లాలోని సోమశిల ప్రాజెక్టు గేట్లు ఎత్తి 1.60 లక్షలు క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. జలాశయ గేట్లు తెరచి అకస్మాత్తుగా నీరు వదలిన కారణంగా... చేజర్ల మండలంలోని పుల్లనీల్లపల్లి, మముడురు, సంగం మండలంలోని వీర్లగుడిపాడు గ్రామాలను వరదనీరు చుట్టిముట్టింది.
పెన్నా నది పరివాహక ప్రాంతంలో కొంతమంది రైతులు వేరుశనగ సాగు చేస్తూ... తమ పనుల్లో నిమగ్నమై ఉండగా... ఒక్కసారిగా పెరిగిన ప్రవాహంలో ఇరుక్కుపోయారు. 48 మంది కూలీలు వరదనీటిలో చిక్కుకుపోయారు. వారిని గ్రామస్థుల సహాయంతో పోలీసు సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.
ఇదీ చదవండి: