ప్రకృతి ఆరాధకులు, మెుక్కల ప్రేమికులు, పెరటి, మిద్దె తోటల పెంపకం దారుల కలయికలో ఏర్పడిందే నెల్లూరు మిద్దె తోటల బృందం. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న రసాయన ఆహార ఉత్పత్తులకు భిన్నంగా సేంద్రియ విధానాల్లో ఆకుకూరలు, కూరగాయాలు, పండ్లు, పూల మొక్కల పెంపకానికి కృషి చేస్తున్నారు ఈ గ్రూపు సభ్యులు. అలాంటి వారంతా నెల్లూరు జిల్లా కావలిలో ఒక్కచోట చేరారు. మిద్దెతోటల పెంపకంలో ఎదురయ్యే సమస్యలపై చర్చించుకుని పరిష్కారాలు తెలుసుకున్నారు.
TERRACE GARDENING : వినయ్‌కుమార్ రెడ్డి, లక్ష్మి దంపతుల ఇంట్లో మిద్దె తోటల సభ్యులు సమావేశమయ్యారు. దేశ విదేశాలకు చెందిన అరుదైన పూలు, పండ్లు, ఔషధ మెుక్కల పెంపకంపై అవగాహన పెంచుకున్నారు. మొక్కలు సంరక్షణ, సేంద్రియ ఎరువుల తయారీ, వినియోగం, బిందు సేద్యం తదితర అంశాలపై సలహాలు ఇచ్చి పుచ్చుకున్నారు. మిద్దె తోటలో పండిన ఆకుకూరలు, కూరగాయలతో నోరూరించే వంటకాలు చేసి కలిగే ప్రయోజనాలు వివరించారు.
కల్తీ, కాలుష్యం పెరిగిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ ఇంటి మీద లేదా ఆవరణలో తోటల్ని పెంచటం ఎంతో ప్రయోజనకరమని నెల్లూరు మిద్దె తోటల బృందం సూచిస్తోంది.
ఇవీచదవండి.