నెల్లూరు కార్పొరేషన్ నాలుగో డివిజన్ అభ్యర్థి మామిడాల కవిత భర్త, మాజీ కార్పొరేటర్ మామిడాల మధును పోలీసులు నిన్న రాత్రి అరెస్టు చేసి... ఉదయం విడుదల చేశారు. ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్నారన్న కారణంతో మధును పోలీసులు అరెస్ట్ చేయగా, తన వద్ద ఎలాంటి నగదు లేకపోయినా, వైకాపా నేతల ప్రోద్బలంతోనే అక్రమంగా అరెస్టు చేశారని మధు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న తెలుగుదేశం నగర ఇంచార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి నవాబ్ పేట పోలీస్ స్టేషన్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అధికార పార్టీ కనుసన్నల్లో పోలీసులు నడుస్తున్నారని ధ్వజమెత్తారు. 49, 50 డివిజన్‌లో క్లస్టర్ ఇన్‌ఛార్జిగా ఉన్న కప్పిర శీనయ్య నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వైకాపా వేధింపుల కారణంగానే ఆత్మహత్యాచేశారని తెలుగుదేశం ఆరోపిస్తోంది. తెదేపా అభ్యర్థుల మద్దతుగా పనిచేయవద్దని వైకాపా నాయకులు తీవ్రస్థాయిలో ఒత్తిడి చేస్తున్నారని మండిపడింది.
ఇదీచదవండి.