పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ నెల్లూరు తెదేపా కార్యాలయంలో తెదేపా మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు తాళ్ళపాక అనురాధ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ నిరాహార దీక్షను జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర ప్రారంభించారు. నిరుపేదలకు, ఎస్టీ ఎస్సీలకు బిల్లు అధికంగా వచ్చాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పెంచిన బిల్లులు తగ్గించాలని లేకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో కరెంట్ బిల్లులు తగ్గిస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చిన వెంటనే బిల్లును పెంచుతున్నారన్నారు.
ఇదీ చదవండి: బాలిక కిడ్నాప్ కేసు.. 4 గంటల్లో ఛేదించిన పోలీసులు