విద్యుత్ పీపీఏల కొనుగోళ్లు విషయంలో హైకోర్టు చెబుతున్నా... ప్రభుత్వానికి అర్థం కాకపోవడం బాధాకరమని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. అజయ్ కల్లం ఒక రాజకీయ నాయకుడిలా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు ఏపీఈఆర్సీ ద్వారా అమలయ్యాయని గుర్తు చేశారు. అందులో ప్రధానమైనది మస్ట్రన్ పవర్ ప్లాంట్స్ అని... దానిని కూడా గత ప్రభుత్వ తప్పిదమే అంటూ అజయ్ కల్లం బృందం అభియోగాలు మోపడం ఎంతవరకూ సబబని ప్రశ్నించారు. కేంద్రం, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఎవరిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటారో అజయ్ కల్లం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ మెడలు వంచి సీఎం ఏపీకి హోదా తెస్తారని అనుకున్నామని, కానీ ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదన్నారు. ఐదుగురు ఎంపీలు ఉన్నప్పుడు ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన వైకాపా... ఇప్పుడు 22 మంది ఉంటే ఎందుకు వెనకడుగు వేస్తుందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి.. ముఖ్యమంత్రి నిర్ణయాలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు'