Somashila Reservoir: గత రెండు రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. పైనుంచి వచ్చే వరదనీటితో.. నెల్లూరు జిల్లా సోమశిల జలాశయానికి 34 వెల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. దీంతో 6 గేట్ల ద్వారా 43 వేల క్యూసెక్కుల నీటిని పెన్నా నది ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. సోమశిల, సంగం వద్ద పెన్నానది వారధిపై.. గేట్లను మూసివేసి రాకపోకలు నిలిపివేశారు. పెన్నా ద్వారా దిగువకు నీరు భారీగా వెళ్తుండటంతో నది పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఇవీ చదవండి: