నెల్లూరు జిల్లాలో...
నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఆదూరుపల్లి బాలయోగి గురుకులంలో కొవిడ్ పంజా విసిరింది. 73 మంది విద్యార్థినులకు పరీక్షలు చేయగా.. 14 మందికి వైరస్ సోకినట్లు నిర్ధరణ అయ్యింది.
పశ్చిమ గోదావరి జిల్లాలో...
పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి మండలం జడ్పీ ఉన్నత పాఠశాలలో కరోనా కలకలం రేపింది. పదో తరగతి చదువుతున్న ఏడుగురు విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. 25 మందికి విద్యార్థులకు పరీక్షలు చేయగా.. ఏడుగురికి నిర్థరణ య్యింది.
తమ పిల్లలు వైరస్ బారిన పడటం పట్ల.. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: విజయనగరం ప్రభుత్వాసుపత్రిలో విషాదం.. ఇద్దరు కొవిడ్ రోగులు మృతి