తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక బరిలో సీపీఎం తమ అభ్యర్థిని ఖరారు చేసింది. నెల్లూరు యాదగరిని అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో పార్టీ శ్రేణులు.. నెల్లూరు-చిత్తూరు జిల్లాలో ప్రచారానికి ప్రణాళికలు రూపొందించారు. ఈ మేరకు నెల్లూరు పార్టీ కార్యాలయంలో రెండు రోజులు సమావేశాలు నిర్వహిస్తూ.. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో ప్రచారం సాగేలా ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో అభ్యర్థి నెల్లూరు యాదగరి పాల్గొన్నారు.
ప్రతి నియోజకవర్గంలో ప్రచార బృందాలతో కలిసి తిరుగుతూ.. ఓటర్లను ఆకట్టుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రజల కోసం, పార్టీ కోసం అవిరళ కృషి చేశానని.. ప్రజలతో నాకు ఉన్న అనుబందమే నన్ను గెలిపిస్తుందని యాదగిరి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 17న తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక జరగనుంది.
ఇదీ చూడండి: