రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు అవుతున్నా… ఇంకా రాజధాని లేకపోవడం బాధాకరమని నెల్లూరు జనసేన పార్టీ నేతలు కిషోర్ కుమార్, డాక్టర్ అజయ్ కుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించకుండా మూడు రాజధానులు ఏర్పాటు చేయడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వం మారినప్పుడల్లా రాజధాని మార్చుకుంటూ పోతే… మన రాష్ట్ర భవిష్యత్తు అథోగతి పాలవుతుందని వాపోయారు. రాష్ట్ర అభివృద్ధి, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. గుంటూరు, కృష్ణా జిల్లాలోని ఎమ్మెల్యేలు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేసి రాజధాని కోసం పోరాడాలన్నారు.
ఇదీ చదవండి :