ETV Bharat / city

NALLAPUREDDY: 'కొత్త జంటలకైనా జగనన్న ఇళ్ల పడక గదులు సరిపోవు'

నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న జగనన్న ఇళ్లపై(Jagananna houses) ఎమ్మెల్యే నల్లపురెడ్డి(MLA NALLAPUREDDY) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వాటిలోని పడకగది కొత్త జంట కలిసి నిద్రించడం సాధ్యం కాదని అభిప్రాయపడ్డారు. ఇళ్ల నిర్మాణాల ప్రగతి భేటీలో సొంత పార్టీ ఎమ్మెల్యే చేసిన సంచలన వ్యాఖ్యలు అందరినీ ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురిచేశాయి.

nallapureddy on jagananna houses
జగనన్న ఇళ్ల పడకగదులు
author img

By

Published : Jun 26, 2021, 10:56 PM IST

Updated : Jun 26, 2021, 11:04 PM IST

నెల్లూరు జిల్లాలోని జగనన్న ఇళ్లపై సొంత పార్టీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి(MLA NALLAPUREDDY) కామెంట్ రాష్ట్రంలో సంచలనంగా మారింది. కట్టిన ఇంటి బెడ్ రూము కొత్త జంటలకు కూడా పనికిరావని కోవూరు నల్లపురెడ్డి అభిప్రాయపడ్డారు. నెల్లూరులో జరిగిన హౌసింగ్ సమావేశంలో ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మించిన పడక గదిలో కనీసం ఇద్దరు పడుకోవడం కూడా అసాధ్యమని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

జిల్లాకు సంబంధించి వైఎస్సార్ జగనన్న(Jagananna houses) గృహ నిర్మాణాల ప్రగతి సమీక్షా సమావేశంలో హౌసింగ్ శాఖ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు, జిల్లా ఇన్చార్జి మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి, రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, జిల్లా కలెక్టర్ చక్రధర బాబు పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

కేంద్రానికి సీజేఐ జస్టిస్​ ఎన్​వీ రమణ లేఖ

'రైతు ప్రయోజనాలు కాపాడేందుకు ప్రభుత్వం కృషి'

Last Updated : Jun 26, 2021, 11:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.