నెల్లూరు నగరంలోని 47వ డివిజన్ లో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ పర్యటించారు. డివిజన్ పరిధిలోని కుక్కలగుంట, గిడ్డంగి వీధి, కామాటివీధి, దర్శి వీధి ప్రాంతాల్లోని స్థానికులతో మాట్లాడారు.
అక్కడి సమస్యలు తెలుసుకున్నారు. వెంటనే సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం 54వ డివిజన్ భగత్‌సింగ్ కాలనీలో పలు పార్టీల కార్యకర్తలకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.