వైకాపా ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి .. తన అనుచరులతో మాట్లాడుతూ సీఎం జగన్‌పై చేసిన వ్యాఖ్యలు.. చర్చనీయాంశంగా మారాయి. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యేగా ఉన్న నల్లపురెడ్డి.. తన ఇంటికి వచ్చిన కార్యకర్తలతో మాట్లాడుతూ.... తిట్టిన వాళ్లకే జగన్ మంత్రి పదవులిచ్చారని వ్యాఖ్యానించారు. ఆ సమయంలో కొందరు కార్యకర్తలు యాదృచ్ఛికంగా చరవాణిలో తీసిన వీడియో బయటకు వచ్చింది. ఐదు రోజుల క్రితం విడవలూరు మండలం ఊటుకూరుకు చెందిన వైకాపా కార్యకర్తలు నెల్లూరులోని ఎమ్మెల్యే ఇంటి వద్ద ఆందోళన చేశారు. ఆ సమయంలో కార్యకర్తలకు నచ్చజెప్పే ప్రయత్నంలో ఎమ్మెల్యే ఇలా మాట్లాడారు.
తిట్టినవాళ్లకే జగన్ మంత్రి పదవులిచ్చారు: వైకాపా ఎమ్మెల్యే - కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి తాజా వార్తలు
కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి.. తన పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తిట్టినవాళ్లకే జగన్ మంత్రి పదవులిచ్చారన్నారు. కార్యకర్తలకు నచ్చజెప్పే ప్రయత్నంలో ఎమ్మెల్యే ఈ వ్యాఖ్యలు చేశారు.