శాస్త్రీయత, సామర్ధ్యం నిరూపణ అయ్యే వరకు కృష్ణపట్నం ఔషధ పంపిణీని ప్రభుత్వం నిలిపివేసేలా చర్యలు చేపట్టాలని జన విజ్ఞాన వేదిక, ప్రజా ఆరోగ్య వేదిక నిపుణులు అభిప్రాయపడ్డారు. ఆయూష్, ఐసీఎంఆర్ అధికారులు మందు పనితీరును వెంటనే పరిశీలించి ఫలితాలను వెల్లడించాలని కోరారు. ప్రజలు కూడా ఓపిక పట్టాలని పిలుపునిచ్చారు.
కొవిడ్ నిబంధనలు పాటించకుండా మందు పంపిణీ చేశారని, గందరగోళం మధ్య ప్రజలు ఇబ్బందులు పడ్డారని వివరించారు. దీనివల్ల కొవిడ్ వ్యాప్తికి కారణం అయ్యారని తెలిపారు.
ఇదీ చదవండి