ETV Bharat / city

Jaganana Layout: ఇది చెరువు కాదు.! జగనన్న కాలనీ.. - Jagananna Colonies Resemble Ponds

Jagananna Colony:పేరు గొప్ప ఊరు దిబ్బలా ఉంది నెల్లూరు జిల్లాలో జగనన్న కాలనీల పరిస్థితి. సరైన రోడ్లు, విద్యుతు సౌకర్యం లేక లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఊరికి దూరంగా పొలాల మధ్య స్థలాలు ఇవ్వడంతో … పరిసరాలు చిట్టడవిని తలపిస్తున్నాయి. వర్షపు నీరు నిలిచి రోడ్లన్నీ చిత్తడిగా మారుతున్నాయి. అధికారుల ఒత్తిడితో కొంతమేర పునాదులు వేసినా.. అక్కడ నివాసం ఉండటం తమవల్ల కాదంటున్నారు లబ్ధిదారులు.

Jagananna Colonies Resemble Ponds
చెరువులను తలపిస్తున్న జగనన్న కాలనీలు
author img

By

Published : Oct 6, 2022, 12:36 PM IST

Updated : Oct 6, 2022, 2:26 PM IST

చెరువులను తలపిస్తున్న జగనన్న కాలనీలు

Jagananna Colony in Nellore District: పేదలందరికీ ఇళ్లస్థలాలు ఇచ్చామంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం.. అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించడంలో మాత్రం విఫలమైంది. నెల్లూరు జిల్లా కోవూరులోని పోతిరెడ్డిపాలెం తిప్పకాలనీలో 150 ఇళ్లు మంజూరు చేశారు. స్థలం ఎంపికలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించారు. లోతు ఎక్కువ ఉన్న స్థలాలను ఇచ్చారు. దాంతో వర్షం వచ్చిందంటే చాలు లేఔట్ చెరువును తలపిస్తోంది. రోడ్లన్నీ మునిగిపోతున్నాయి. ఒక్కో ఇంటికి 50 ట్రిప్పుల మట్టి తోలాల్సి ఉంటుంది. కనీసం ఎత్తు పెంచడానికే లక్షన్నర రూపాయలు ఖర్చు అవుతోందని లబ్ధిదారులు వాపోతున్నారు.

ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఏమాత్రం సరిపోవడం లేదంటున్నారు. స్థలం ఇచ్చాం కదా కొంత సొమ్ము పెట్టుకుని సొంతింటి కల నెరవేర్చుకోండంటూ అధికారులు ఉచిత సలహాలు ఇస్తున్నారని చెబుతున్నారు. రోడ్లు, మురుగు కాల్వలు నిర్మించలేదని.. మంచినీరు, విద్యుత్‌ సమస్యలు ఉన్నాయని తెలిపారు.

కోవూరులోని పడుగుపాడు రైల్వే గేట్ కాలనీలోనూ వర్షం వస్తే ఇళ్లల్లోకి నీరు చేరుతోంది. ఇక్కడ 150 మంది మత్స్యకారులకు స్థలాలు ఇచ్చారు. ఇప్పటి వరకు రోడ్లు వేయలేదని తెలిపారు. వర్షపు నీరు వెళ్లేలా కాలువలు నిర్మించలేదని లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి 6 నుంచి 7 లక్షల ఖర్చు అవుతోందని లబ్ధిదారులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న నిధులు సరిపోవడం లేదంటున్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తవుతున్నపటికి ఇప్పటివరకు విద్యుత్ లైన్లను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేదు.

ఇవీ చదవండి:

Last Updated : Oct 6, 2022, 2:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.