ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు రెండో విడత అమ్మ ఒడి కార్యక్రమాన్ని నెల్లూరులో ప్రారంభించనున్నారు. పదకొండున్నర గంటలకు సీఎం జగన్ నెల్లూరు చేరుకోనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను రాష్ట్ర మంత్రులు, జిల్లా కలెక్టర్ ఇప్పటికే పూర్తి చేశారు. ముఖ్యమంత్రికి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సెంటర్, వీఆర్సీ సెంటర్, ముత్తుకూరు రోడ్డు సెంటర్, జాతీయ రహదారులపై ప్లకార్డులతో సందడి నెలకొంది.
ఇవీ చూడండి: