మాదక ద్రవ్యాలు సరఫరా చేసే అంతర్జాతీయ ముఠాను నెల్లూరు పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలో కొందరు విద్యార్థులకు మాదక ద్రవ్యాలు సరఫరా అవుతున్నాయన్న సమాచారంతో నిఘా ఉంచిన పోలీసులు... నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. నైజీరియా దేశానికి చెందిన శామ్యూల్ ఉచే, గినీ బిసూ దేశానికి చెందిన యెహీరమ్ నునెస్, చెన్నైకి చెందిన లక్ష్మీనారాయణ, నెల్లూరుకు చెందిన సాదిక్లను కృష్ణపట్నం పోర్టు వద్ద అరెస్ట్ చేశారు. వీరి నుంచి కొకైన్, ఎల్.ఎస్.డి, ఎం.డి.ఎం.ఏ. తదితర మాదకద్రవ్యాలతో పాటు కారు, లాప్టాప్, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఆన్లైన్లో మాదకద్రవ్యాలను బుకింగ్ చేస్తూ... బిట్ కాయిన్ ద్వారా చెల్లింపులు జరుపుతున్నట్లు జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి తెలిపారు.
నెల్లూరులో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా అరెస్ట్ - DRUGS GANG
నెల్లూరులో అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠా గుట్టు రట్టయింది. విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారనే సమాచారంతో నిఘా పెట్టిన పోలీసులు... నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు విదేశీయులు కాగా... మరో ఇద్దరు రాష్ట్రానికి చెందినవారు.