ETV Bharat / city

'పిటిషన్​కు విచారణ అర్హత లేదు' - mla kakani govardhan reddy pitetion

నెల్లూరు జిల్లా సర్వేపల్లి వైకాపా ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డిపై కేసు ఎత్తివేతకు విజయవాడలోని ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం నిరాకరించింది. పిటిషన్​కు విచారణ అర్హత లేదని తెలిపింది. ­

'పిటిషన్​కు విచారణ అర్హత లేదు'
'పిటిషన్​కు విచారణ అర్హత లేదు'
author img

By

Published : Sep 21, 2021, 7:27 AM IST

నెల్లూరు జిల్లా సర్వేపల్లి వైకాపా ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్​రెడ్డిపై కేసు ఎత్తివేతకు విజయవాడలోని ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసుల విచారణ ప్రత్యేక న్యాయస్థానం నిరాకరించింది. హైకోర్టు అనుమతి లేకుండా ఎంపీ, ఎమ్మెల్యేలపై కేసుల ఉపసంహరణ కుదరదంటూ గత నెలలో సుప్రీంకోర్టు ఉత్తర్వులిచ్చిన నేపథ్యంలో కేసు ఎత్తివేతకు అనుమతించబోమని స్పష్టం చేసింది. పిటిషన్​కు విచారణ అర్హత లేదని తెలిపింది. ­ఎమ్మెల్యే గోవర్ధన్ రెడ్డిపై కేసు ఉపసంహరణకు అనుమతించాలంటూ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దాఖలు చేసిన పిటిషన్​ను వెనక్కి ఇచ్చేసింది. తన ప్రతిష్ఠ దెబ్బతీసేందుకు ఫోర్జరీ పత్రాలు సృష్టించి మోసం చేశారంటూతెలుగుదేశం నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో...గతంలో గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదైంది.

ఇదీచదవండి. cm jagan on parishad results: 'ఈ అఖండ విజయం..మా బాధ్యతను పెంచింది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.