నెల్లూరులో ఏ.పీ.ఆర్. హెల్పింగ్ హ్యాండ్స్ సంస్థ ఛైర్మన్ సయ్యద్ నిజాముద్దీన్ ఎన్-95 మాస్కులను పోలీసులకు అందజేశారు. నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో 350 మాస్కులను ఎస్పీ భాస్కర్ భూషణ్కు ఇచ్చారు. నెల్లూరు ఎం.పీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సూచనలతో నాణ్యమైన మాస్కులు పోలీసుల కోసం ప్రత్యేకంగా తయారు చేయించినట్లు నిజాముద్దీన్ తెలిపారు. తమ సంస్థ తరపున మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.
ఇవీ చదవండి.. 'కరోనా కష్టకాలంలోనూ జగన్ కాసులు దండుకుంటున్నారు'