నెల్లూరు కార్పొరేషన్ అధికారులు నగరంలోని రేబాలవారివీధిలోని పలు డ్రై ఫ్రూట్ షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ షాపుల్లోని బస్తాల్లో పురుగులు పట్టిన జీడిపప్పు, కుళ్లిపోయిన ఖర్జూరం, ఇతర ఆహార పదార్థాలను గుర్తించి వాటిని నిర్వీర్యం చేశారు. దుకాణ యజమానులపై జరిమానా విధించటంతో పాటు షాపులను సీజ్ చేశారు.
అనంతరం మినీ బైపాస్ రోడ్లోని పలు షోరూంలను తనిఖీ చేసి.. కొవిడ్ నిబంధనలను పాటించని వాటిని మూయించారు. వ్యాపారులు నిబంధనలు పాటించాలని సూచించారు.
ఇదీ చూడండి..