లాక్‌డౌన్ కారణంగా.. పూట గడవడమే కష్టంగా మారిన నిరుపేదల కష్టాలు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గ రైతులను కదిలించాయి. ఇందుకు అనికేపల్లి గ్రామంలో.... ఓ చిరు ఆలోచనకు బీజం పడింది. తెల్లరేషన్ కార్డుదారులకు బియ్యం, నిత్యావసరాలు ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్నా....లాక్‌డౌన్ ముగిసిన తర్వాత కూడా కూలి పనులు దొరక్క పేదలు కష్టాలు పడతారని అంచనా వేశారు. కష్టకాలంలో కొందరికైనా అండగా నిలవాలని నిర్ణయించారు.
కదిలించిన అనికేపల్లి
అనికేపల్లిలోని.. ప్రతి రైతూ ఎకరాకు కనీసం ఒక్కబస్తా ధాన్యమైనా అందించేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. అనికేపల్లి బాటలోనే సర్వేపల్లి నియోజకవర్గంలోని 5 మండలాల రైతులు కదిలారు. ఇప్పటి వరకూ సుమారు 800 టన్నుల ధాన్యం సేకరించారు. వీటిని మిల్లింగ్ చేసి లక్ష మంది పేదలకు... 5 కిలోల చొప్పున పంపిణీ చేయనున్నారు.
రైతుల ఆలోచనను స్థానిక ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి ప్రోత్సహిస్తున్నారు. సర్వేపల్లి రైతన్న కానుక పేరిట పేదలకు ధాన్యం పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. 117 పంచాయతీల రైతులు ధాన్యం సేకరణకు ముందుకురావడమేగాక..... ఇతర నిత్యావసరాల కోసం 10లక్షల విరాళాలనూ సేకరించడం...నలుగురికీ స్ఫూర్తిగా నిలుస్తోంది.
ఇదీ చదవండి :