నెల్లూరు మత్స్య శాఖ కార్యాలయం వద్ద మత్స్యకారుల సంఘం ధర్నాకు దిగారు. వేలం నిర్వహణ జీవోను వెంటనే రద్దు చేయాలంటూ ఆందోళన చేపట్టారు. వేలం నిర్వహించి ప్రభుత్వమే చేపల అమ్మకాన్ని చేపట్టడం ద్వారా చెరువులను నమ్ముకున్న గిరిజన రైతులు, మత్స్యకారులు వీధిన పడతారని వాపోయారు. ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేయకుంటే పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు నాగేశ్వరరావుకు వినతిపత్రం అందజేశారు.
ఇదీ చదవండి :