ఇంజినీరింగ్ అసిస్టెంట్స్‌ను గ్రామ సచివాలయాల్లో నియమించి... వారికి సంబంధం లేని పనులను అప్పగించటం సమంజసం కాదని పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మురళీకృష్ణ నాయుడు పేర్కొన్నారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్స్ ఇప్పుడు గ్రామ సచివాలయాల్లో ఇతర పనులు చేయలేక రాజీనామాలు చేసే పరిస్థితి తలెత్తిందన్నారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే దాదాపు 150 మందికి పైగా రాజీనామా చేశారని తెలిపారు.
పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ అసోసియేషన్ 39వ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నెల్లూరులో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ఇంజినీరింగ్ అసిస్టెంట్స్‌ను సంబంధిత శాఖల ఆధీనంలో ఉంచాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 25వేల కిలోమీటర్ల రోడ్ల నిర్మాణాలు చేపట్టిన పంచాయతీరాజ్ శాఖ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. ప్రస్తుతం ఆ పనులపై విచారణ పేరుతో వేధింపులకు గురి చేయడం సరికాదని స్పష్టం చేశారు. వేధింపులు ఆపకుంటే సహాయ నిరాకరణ చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి