ETV Bharat / city

నిబంధనలు గాలికి.... పాఠశాల ప్రాంగణంలో కొవిడ్ పరీక్షలు - నెల్లూరు హైస్కూల్ లో విద్యార్థులు కరనా అనుమానితులు

కరోనా నిర్థరణ పరీక్షలు చేసే కేంద్రం ఒక పక్క, విద్యార్థులకు మధ్యాహ్న భోజన సరకులు అందించడం మరోపక్క. నెల్లూరు నగరంలోని జిల్లా పరిషత్ బాలురు, బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో కనిపిస్తున్న ఈ పరిస్థితిని చూసి విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. కరోనా పరీక్షల కోసం వస్తున్నవారు పాఠశాల ఆవరణలో తిరగడంతో కరోనా సోకుతుందేమోనన్న భయం వేస్తుందని విద్యార్థులు అంటున్నారు.

నిబంధనలు గాలికి.... పాఠశాల ప్రాంగణంలో కొవిడ్ పరీక్షలు

author img

By

Published : Aug 14, 2020, 10:43 PM IST

నెల్లూరు నగరంలోని పొదలకూరు రోడ్డు దర్గామిట్టలో బాలుర, బాలికల ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. కరోనా కారణంగా పాఠశాలలు మూసే ఉంచారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గత వారం రోజులుగా విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకంలో కోడిగుడ్లు, బియ్యం ఇస్తున్నారు. వీటి కోసం తల్లితండ్రులతో కలిసి విద్యార్థులు వస్తున్నారు. ఈ ప్రాంగణంలోనే కరోనా నిర్థరణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా అనుమానితులు పాఠశాల ప్రాంగణంలో ఉండడంతో విద్యార్థులు తల్లితండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఒకే గేటు నుంచి కొవిడ్ పరీక్షలకు వచ్చేవారు, విద్యార్థులు వస్తున్నారు. కొవిడ్ పరీక్షలకు వచ్చే వారిలో ఎంత మందికి కరోనా పాజిటివ్ ఉందో అర్థం కావడం లేదని, విద్యార్థులకు తెలియక వారితో కలిసి లోపలికి నడవడం, ఆటోల్లో కలిసి వస్తున్నారని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

పాఠశాల భవనం, కొవిడ్ కేంద్రం సమీపంలోనే ఉన్నాయి. రెండింటి మధ్య తాళ్లు కట్టారు. పరీక్షల కోసం వచ్చి ఎక్కువ సేపు క్యూలో నిలవబడలేని కొవిడ్ అనుమానితులు పాఠశాల వద్ద చెట్ల కింద, అరుగుల వద్ద కూర్చుంటున్నారు. కొవిడ్ పరీక్షలకు వచ్చినవారు భౌతిక దూరం పాటించడంలేదని, పరిస్థితి చూస్తే భయంగా ఉందని విద్యార్థులు అంటున్నారు.

నెల రోజుల కిందట జీజీహెచ్ కొవిడ్ ఆసుపత్రిలో పరీక్షా కేంద్రం ఉండేది. ఇటీవల ఉన్నత పాఠశాల ఆవరణలోని భవనంలోకి మార్చారు. అధికారులు స్పందించి కరోనా పరీక్షల కేంద్రాన్ని వేరొకచోటికి మార్చాలని విద్యార్థులు కోరుతున్నారు.

ఇదీ చదవండి : ఆప్తబంధువులు.. అంత్యక్రియల్లో సాయం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.