ETV Bharat / city

వాళ్లు చేప, చికెన్​ ముట్టుకోరు... ఎందుకంటే?

చికెన్.... చాలామంది ఎంతో ఇష్టపడి తినే మాంసాహారం. గుడ్డు.. పోషక విలువలున్న పౌష్టికాహారం. చేప.. ఎంతోమందికి ఇష్టమైన వంటకం. శాకాహారులు మినహా మిగిలిన వారంతా ఈ మూడింటినీ రకరకాలుగా వండుకుని లొట్టలేసుకుంటూ... రుచుల్ని ఆస్వాదిస్తారు. కానీ వనపర్తి జిల్లాలోని ఓ తండా వాసులు మాత్రం... వాటిని అస్సలు ముట్టుకోరు. తరతరాలుగా కోడిగుడ్డు, కోడికూర, చేపమాంసానికి దూరంగా ఉంటున్నారు. తినడం కాదు... వాటిని పెంచరు కూడా. అన్ని ఊళ్లలో కోడికూతతో తెల్లవారితే ఆ తండాలో కోడికూతే వినిపించదు. ఇంతకీ ఎక్కడా పల్లె అనుకుంటున్నారా? మీరే చూడండి.

chicken-egg-and-fish-are-not-eaten-in-tanda-at-wanaparthy-district
author img

By

Published : Sep 5, 2019, 10:05 AM IST

వనపర్తి జిల్లా పెబ్పేరు మండలం కంచీరావుపల్లి తండా గ్రామం. ఇటీవలే ఈ తండా పంచాయతీగా మారింది. జనాభా సుమారు 500 మంది ఉంటారు. తరతరాలుగా ఈ తండాలో కోడికూర, కోడి గుడ్డు, చేపలు అసలు తినరు. కారణం వారి గురువు సోమ్​సాధ్ భావోజీ... కోళ్లను, చేపల్ని తినొద్దని చెప్పారట. అప్పటి నుంచి రాత్లావత్ అనే ఇంటి పేరు కలిగిన వారు ఎవరూ కోడి, చేప మాంసాన్ని ముట్టుకోరు. గుడ్డు తినరు. కోడి, చేపలను పెంచరు. అందుకే తండాలో ఎక్కడ వెతికినా కోడి మాత్రం కనిపించదు.

ఇదే కారణం:

తాను ఉమ్మేసిన ఉమ్మిని కోడి తినడం చూసిన బావోజీ... అలాంటి కోళ్లను అసలు పెంచొద్దు. తినొద్దు అని ఆదేశించారు. అప్పటి నుంచి ఆ ఊళ్లో కోళ్లు బంద్. ఒకవేళ ఎవరైనా కట్టుబాటు దాటి తింటే వారికి చెడు జరుగుతుందని తండా వాసుల ప్రగాఢ విశ్వాసం.

కోడళ్లు కూడా తినొద్దు:

పండగలు వస్తే తండావాసులు గొర్రె, మేక మాంసాన్ని వండుకుని తింటారు. ఇంటికి బంధువులు వచ్చినా... వీరు బంధువుల ఇళ్లకు వెళ్లినా వండాల్సింది మటనే. కంచీరావుపల్లితండా నుంచి మెట్టినింటికి వెళ్లే ఆడపడుచులు అక్కడ ఏ మాంసమైనా తింటారు. కానీ తండాకు కోడళ్లుగా వచ్చే ఆడపిల్లలు మాత్రం పెళ్లి సంబంధం ఖాయమైన నెల రోజుల్లోనే చికెన్, గుడ్డు, చేపలను తినడం మానేస్తారు. బలవంతంగా తినాలని ప్రయత్నిస్తే వాంతులవుతాయని... అసలు తినాలనే అనిపించదని చెబుతున్నారు ఆ తండాకు కోడళ్లుగా వచ్చిన వాళ్లు.

ఎక్కడికెళ్లినా పాటిస్తారు:

ఇక తండా నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లి నివాసముండే వాళ్లు సైతం అక్కడ తమ ఆచారాన్ని తప్పకుండా పాటిస్తారు. తాతలు, తండ్రులు సహా ఇప్పటి తరం కూడా ఈ ఆచారాన్ని బలంగా విశ్వసిస్తోంది.

వాళ్లు చేప, చికెన్​ ముట్టుకోరు... ఎందుకంటే?

ఇదీ చూడండి :అరుదైన రికార్డు... 73 ఏళ్లకు గర్భం

Intro:పుడమి, ప్రకృతి, పచ్చదనం, నీటి కలయికల ప్రేమ చిహ్నం.

Body:కొద్ది రోజులుగా కురిసిన వర్షాలకు చెరువులు కుంటలు నిండి,పచ్చదనంతో ప్రకృతి అందాలు ఆరబోసినట్లు ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలోని కుంటలో ప్రకృతి, పుడమి కలసి సహజసిద్ధంగా తయారు చేసిందా అన్నట్లుగా ప్రేమ చిహ్నం ఏర్పడింది. పుడమి ఆకృతి, జల సవ్వడి ,పచ్చని గడ్డి పైర్లు ఆ నీటి పైన తేలియాడుతూ ఆ ప్రేమ చిహ్నాన్ని ఆకుపచ్చని రంగుతో మరియు నీటితో నింపింది అన్నట్లుగా ఉంది. పుడమి పరవశం, నీరు నయగారాలు,ప్రకృతి పులకరింత, పచ్చదనం పెంచినట్లు ఈ ప్రేమ చిహ్నం దృశ్యం కడు సుందరంగా, సహజంగా, అందంగా, వర్ణనాతీతంగా ఉంది.

Conclusion:ప్రకృతి పుడమి పచ్చదనం అందాలు సహజసిద్ధంగా ఏర్పడాలి కలకాలం ఉండాలి.సహజసిద్ధమైన వనరులను, కొండలను, గుట్టలను, పర్వతాలను, వనాలను తరతరాల భవిష్యత్ దృష్ట్యా కాపాడాలి. కిట్ నెంబర్:1272, బిక్షపతి, దుబ్బాక. 9347734523.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.