ETV Bharat / city

నూతన జిల్లాల ఏర్పాటుపై .. పలు జిల్లాల్లో వైకాపా నాయకుల ర్యాలీ

నూతన జిల్లాల ఏర్పాటును స్వాగతిస్తూ.. పలు చోట్ల వైకాపా నాయకులు ర్యాలీ చేపట్టారు. సీఎం జగన్​కు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

వైకాపా నాయకులు ర్యాలీ
వైకాపా నాయకులు ర్యాలీ
author img

By

Published : Apr 4, 2022, 5:31 PM IST

రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటుతో పరిపాలన సౌలభ్యం ఉంటుందని కర్నూలు ఎమ్మెల్యే హాఫీస్‌ఖాన్ అన్నారు. నూతన జిల్లాల ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతతో కర్నూలు మెడికల్ కళాశాల నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. గతంలో కర్నూలు రావాలంటే 150కిలోమీటర్లు దూరం ప్రయాణించాల్సి వచ్చేదని, ఇప్పుడు 75 కిలో మీటర్లకు తగ్గిందని ఆనందం వ్యక్తం చేశారు.

చిన్న అపశ్రుతి: ప్రకాశం జిల్లా కనిగిరిలో ఏర్పాటుచేసిన రెవెన్యూ డివిజన్ కార్యాలయ ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ సహా వైకాపా నాయకులు వెళుతుండగా... చిన్న అపశ్రుతి జరిగింది. మినీ లారీలో కనిగిరి వీధుల్లో ర్యాలీ చేస్తుండగా.. వాహనానికి కట్టిన బారికేడ్లు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఎమ్మెల్యే సహా వైకాపా నాయకులు ముందుకు ఒరిగారు. అయితే వాహన క్యాబిన్ అడ్డుగా ఉండటం వల్ల ప్రమాదం తప్పింది. అపరిమిత సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు లారీ ఎక్కడం వల్లే బారికేడ్లు విరిగిపోయాయి.

వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులు : కొత్త జిల్లాల ఏర్పాటుకు మద్దతుగా పశ్చిమగోదావరి జిల్లా తణుకులో వైకాపా నాయకులు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తణుకు పట్టణంలో పార్టీ కార్యాలయం నుంచి ప్రధాన రహదారుల మీదుగా ర్యాలీ కొనసాగింది. బాలుర ఉన్నత పాఠశాల వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

ఇదీ చదవండి: వికేంద్రీకరణే మా విధానం.. కొత్త జిల్లాలతో ప్రజలకు మెరుగైన పాలన: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.