కర్నూలు ప్రభుత్వాసుపత్రి వద్ద సోమవారం రాత్రి కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆందోళన చేశారు. రోగులను వైద్యులు సరిగ్గా పట్టించుకోవడం లేదని ఆయన ఆరోపించారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన ముగ్గురు యువకులు ఆసుపత్రికి వస్తే ఏడు గంటలు సమయం దాటినా చికిత్స అందించలేదని వైద్యులపై ఎమ్యెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద సంఖ్యలో తన అనుచరులతో ఆసుపత్రిలో ఆందోళన చేయటంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆసుపత్రి పర్యవేక్షకుడికి ఫోన్ చేసినా స్పందించడం లేదని ఎమ్మెల్యే తెలిపారు.
ప్రభుత్వాసుపత్రి వద్ద వైకాపా ఎమ్మెల్యే ఆందోళన - కర్నూలు ప్రభుత్వాసుపత్రి వార్తలు
రోగులకు మెరుగైన చికిత్స అందడం లేదని కర్నూలు ప్రభుత్వాసుపత్రి వద్ద వైకాపా ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ ఆందోళన చేశారు. వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఫోన్ చేసినా అధికారులు స్పందించడం లేదని ఎమ్మెల్యే అన్నారు.

ఇదీ చదవండి