ETV Bharat / city

VENUS COLONY PARK IN KURNOOL : చందాలు వేసుకుని పార్కు నిర్మాణం.. ప్రత్యేక ఆకర్షణగా జాతీయ జెండా

Venus colony park in kurnool : మానసిక ప్రశాంతతోపాటు ఆరోగ్యానికి ఆహ్లాదకరమైన వాతావరణం అవసరం. నగరాల్లో కాసేపు సేదతీరాలంటే అనువైన ప్రదేశమే కనిపించదు. అందుకే కర్నూలు వీనస్‌ కాలనీ వాసులు చందాలు వేసుకుని మరీ ఓ ఉద్యానవనాన్ని నిర్మించుకున్నారు. ప్రభుత్వం సైతం చేయికలపడంతో అత్యంత సుందరమైన పార్కు సిద్ధమైంది.

కర్నూలులోని వీనస్ కాలనీ పార్కు
కర్నూలులోని వీనస్ కాలనీ పార్కు
author img

By

Published : Dec 12, 2021, 9:32 AM IST

కర్నూలులోని వీనస్ కాలనీ పార్కు

Venus colony park in kurnool : ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తున్న ఈ పార్కు... కర్నూలు నగరంలోని వీనస్ కాలనీలో ఉంది. చుట్టూ పచ్చని చెట్లతోపాటు వ్యాయామానికి అవసరమైన వాకింగ్ ట్రాక్‌, చిన్నారులకు ప్రత్యేకంగా ఆటవస్తువులు, వృద్ధులు సేదతీరేలా బల్లలు ఏర్పాటు చేశారు. అర్థాంతరంగా ఆగిపోయిన పార్కును కాలనీవాసులు చందాలు పోగుచేసిన సొమ్ముతోపాటు అమృత్‌ పథకం, నగరపాలక సాధారణ నిధి కింద రూ.48 లక్షలు వెచ్చించి పూర్తిస్థాయిలో ఉద్యానవనాన్ని అభివృద్ధి చేశారు.

పంచతత్వ ఏర్పాటు...

ఈ ఉద్యానవనంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. రూ.8 లక్షల రూపాయలతో పంచతత్వ ఏర్పాటు చేశారు. ఇక్కడ నడవడం ద్వారా కాళ్లల్లో రక్తప్రసరణ బాగా పెరిగి అనేక వ్యాధులు దూరమవుతాయన్నారు. ఉదయం ఎంతో స్వచ్ఛమైన గాలి విడుదలవుతుందని వివరించారు.

ప్రత్యేక ఆకర్షణగా త్రివర్ణపతాకం...

ఈ పార్కులో ఏర్పాటు చేసిన భారీ త్రివర్ణపతాకం అందరి దృష్టినీ ఆకట్టుకుంటోంది. జాతీయ జెండాను చూస్తే దేశ భక్తి ఉప్పొంగుతుంది. 168 అడుగుల ఎత్తైన స్తంభానికి జాతీయ జెండాను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోనే ఏలూరు తర్వాత అతిపెద్ద పతాకంగా అధికారులు చెబుతున్నారు. రెపరెపలాడుతున్న జాతీయ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆధునిక వ్యవస్థలో మనిషి ఒత్తిడిని జయించాలంటే ఇలాంటి ఉద్యానవనాల అవసరం ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

ఇవీచదవండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.