ETV Bharat / city

పేదరికంతో ఉన్నతంగా.. సీఏ చదువుతో సేవే మార్గంగా.. - ca chandrasekhar helped poor people news

పొట్టకూటి కోసం వీధుల్లో తల్లితో పాటు సమోసాలు అమ్మిన బాలుడు... నేడు నలుగురికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగాడు. పూట గడవడమే కష్టంగా బతికిన అతడు.. నేడు ఎన్నో కుటుంబాలకు చేయూతనిస్తున్నాడు. కష్టమైన సీఏను మెుదటి ప్రయత్నంలోనే అందుకొని... చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించాడు. కష్టాల ఒడిలో ఎదిగిన ఆ యువకుడు.. సేవా కార్యక్రమాల ద్వారా పేద కుటుంబాలకు బాసటగా నిలిచే ప్రయత్నం చేస్తున్నాడు. కరోనా కష్టకాలంలోనూ 15 వందల కుటుంబాలకు సాయం చేసి... తన దాతృత్వాన్ని చాటుకున్నాడు. అతడే కర్నూలుకి చెందిన చంద్రశేఖర్ రాజు.

పేదరికంతో ఉన్నతంగా.. సీఏ చదువుతో సేవే మార్గంగా..

author img

By

Published : Jun 23, 2020, 7:08 PM IST

Updated : Jun 26, 2020, 5:04 PM IST

ఆదర్శం.. చంద్రశేఖర్​ రాజు జీవితం

కర్నూలుకు చెందిన చంద్రశేఖర్ రాజుది చాలా పేద కుటుంబం. వాళ్ల తల్లి వీధుల్లో వడలు, సమోసాలు విక్రయించేవారు. తండ్రి... చెన్మమ్మ సర్కిల్‌లో చిన్న పాన్‌ షాపు నిర్వహించేవారు. వారికి.. పూట గడవడమే కష్టంగా ఉన్నప్పటికీ.. కొడుకు తమలా కష్ట పడకూడదని.. చంద్రశేఖర్‌ను ప్రైవేటు పాఠశాలలో చేర్పించారు. చిన్నప్పటి నుంచే చదువులో చురుకుగా ఉండే చంద్రశేఖర్.. పది, ఇంటర్‌లో ఉత్తమ మార్కులు సాధించారు. ఎంసెట్‌లో మంచి ర్యాంకు వచ్చినా.. ఫీజు చెల్లించే స్థోమత లేక డిగ్రీలో చేరాడు. ‌అటు డిగ్రీ చదువుతునే... ఎలాగైనా ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ కావాలనే లక్ష్యంతో.. కష్టపడి మెుదటి ప్రయత్నంలోనే సీఏను సాధించాడు‌.

  • సమాజ సేవే లక్ష్యంగా

సీఏ పూర్తయిన తరవాత.. సొంతంగా కార్యాలయాన్ని ప్రారంభించి.. 9 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు చంద్రశేఖర్‌ రాజు. సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే లక్ష్యంతో... ఈ ఏడాది జనవరిలో.. వీ త్రీ ఫౌండేషన్‌ పేరుతో ఓ స్వచ్ఛంద సేవా సంస్థను ప్రారంభించారు. దీని ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. మెుదట్లో ఒక్కడిగా ప్రారంభమైన ఈ సంస్థ... నేడు 3 వందల మంది వాలంటీర్లతో ఒక సేవా సైన్యంలా మారింది. మెుదట్లో.. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పుస్తకాలు, స్కూలు బ్యాగులు అందించారు. వేసవిలో దాహంతో అలమటించే పక్షులు, జంతువుల కోసం... జంతు జలనిధి కార్యక్రమాన్ని చేపట్టారు. అలాగే, మెుక్కలను నాటే కార్యక్రమాన్ని సైతం దీక్షగా తీసుకుంది వీ త్రీ ఫౌండేషన్‌.

  • కరోనాలోనూ సేవా కార్యక్రమాలు

కరోనా కష్టకాలంలోనూ మేమున్నామంటూ కర్నూలు చుట్టుపక్కల గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేపడుతున్నాడు చంద్రశేఖర్ రాజు. రైతులు, వలసకూలీలు, వికలాంగులకు భోజనం అందించారు. పూట గడవడానికి కష్టంగా 15 వందల కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందజేశారు.

  • రైతులపై ప్రేమతో..

చంద్రశేఖర్ రాజుకు రైతులంటే ఎంతో అభిమానం. వ్యవసాయానికి సైతం వారసులు ఉండాలనే కథనంతో తెరకెక్కిన రైతన్న లఘు చిత్రానికి మాటలను అందించాడు. అలాగే.. ఈ చిత్రానికి సహ నిర్మాతగా కూడా వ్యవహించాడు. ఉన్నత చదువులు అభ్యసించేటప్పుడు ప్రతి విద్యార్థికి కష్టాలు ఎదురవుతాయి. విజయం వరించాలంటే.. వాటిని ఎదుర్కొని ముందుకు సాగాలనే స్ఫూర్తిమంతమైన "మాటల శతకం"అనే పుస్తకాన్ని సైతం రచించాడు చంద్రశేఖర్‌ రాజు.

  • విధి నిర్వహణే.. దేశ సేవ

యువత దేశాభివృద్ధిలో భాగస్వాములవ్వాలి. విధి నిర్వహణకు మించిన దేశ సేవ లేదంటూ.. జనగనమణ పేరుతో ఓ గేయాన్ని రాసి... ఆల్బమ్‌ రూపొందించారు చంద్రశేఖర్ రాజు. చిన్న వయస్సులోనే ఛార్టెడ్‌ అకౌంటెంట్‌గా రాణిస్తూ.. సేవా కార్యక్రమాలు చేపడుతున్న చంద్రశేఖర్ రాజు.. ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాడు.

ఇదీ చూడండి..: అనగనగా ఓ గుట్ట.. ఆ గుట్ట గండెల్లో గుణపం

Last Updated : Jun 26, 2020, 5:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.