కర్నూలు - తెలంగాణ సరిహద్దు వద్ద ఈ-పాస్(E pass) లేని వాహనాలను.. తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. కర్నూలు సరిహద్దు టోల్ గేట్ వద్ద ప్రైవేటు వాహనాలను నిలిపివేశారు. ఈ-పాస్(E pass) ఉంటేనే తమ రాష్ట్రంలోకి అనుమతిస్తామని తెలంగాణ పోలీసులు స్పష్టం చేస్తున్నారు.
దాదాపు 20కి పైగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు.. ఈ-పాస్(E pass) లేదని అర్ధరాత్రి నుంచి నిలిపివేయడంపై ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. దూర ప్రాంతం నుండి వచ్చామని ఇప్పుడు తిరిగి వెళ్లలేమని.. అధికారులు స్పందించి తమను తెలంగాణలోకి పంపించే ఏర్పాట్లు చేయాలంటూ ప్రయాణికులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: