కొవిడ్ థర్డ్ వేవ్ నేపథ్యంలో విద్యార్థులకు కరోనాపై అవగాహన కల్పించేందుకు కర్నూలులోని ఓ పాఠశాల యాజమాన్యం వినూత్నంగా ఆలోచించింది. కరోనా నేపథ్యంలో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు వారితోనే ఆర్ట్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయించింది. కరోనా తీవ్రత, ప్రభుత్వ నిబంధనలు, వాటిపై అవగాహన కల్పించేలా విద్యార్థుల చేత వివిధ రకాల బొమ్మలు వేసి ప్రదర్శించారు. దీని వల్ల కరోనాపై అవగాహన పెరిగి కొవిడ్ వ్యాప్తిని కొంతవరకు అరికట్టవచ్చని యాజమాన్యం భావిస్తోంది.
ఇదీచదవండి: VIP'S IN TIRUMALA : శ్రీవారి సేవలో సినీ, రాజకీయ ప్రముఖులు
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!