శ్రీశైలంలోని శ్రీగిరి శ్రీశైల పరిరక్షణ సమితి... ప్రజలు, అధికారులకు విశేష సేవలందిస్తోంది. నిరుపేదలకు నిత్యవసర సరుకులు కూరగాయలు పంచుతూ ఆదుకుంటోంది. కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు విధులు నిర్వహిస్తున్న పోలీసులు వైద్య సిబ్బందికి ఆసరాగా నిలుస్తోంది. విధులు నిర్వర్తించే సిబ్బందికి కూల్‌డ్రింక్స్, వాటర్‌బాటిల్స్, బిస్కెట్పాకెట్స్, ఆహార పొట్లాలు అందజేస్తూ అధికారులకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. ప్రతి బుధవారం నిరాశ్రయులకు, సాధువులకు రుచికరమైన భోజనం తయారు చేసి ప్యాకెట్ల రూపంలో అందజేస్తూ ఆదర్శంగా నిలిచింది.
కళ్యాణదుర్గం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖల తరఫున పేదలకు నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేశారు. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని వందలాది మంది పేదలకు, మహిళలకు, వృద్ధులకు పట్టణంలోని మూడు శాఖలకు సంబంధించిన ఉద్యోగులు కలిసి సరకులు పంపిణీ చేశారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట పురపాలక సంఘం భూపయ్య కాలనీ పరిసర ప్రాంతాల్లో సోమవారం ఎమ్మెల్యే కె.సంజీవయ్య చేతుల మీద 1500 కుటుంబాలకు 8 కోడిగుడ్ల చొప్పున అందించారు. దాత కట్టా వెంకటరమణారెడ్డి వీటిని రెడ్‌జోన్ ప్రాంతాల్లో పంపణీ చేశారు.
లాక్‌డౌన్ నేపథ్యంలో కరోనా వైరస్ నివారణ చర్యల్లో భాగంగా కడప జిల్లా పులివెందుల రోడ్డులోని జీటీ ఫంక్షన్ హాలులో సీపీఐ ఆధ్వర్యంలో పేద ప్రజలకు 6 రకాల చొప్పున కూరగాయలు పంపిణీ చేశారు. సుమారు 600 కుటుంబాలకు పంచిపెట్టారు.
ఇదీ చదవండి: