ETV Bharat / city

PULLURU TOLL GATE : తెలంగాణలోకి నో-ఎంట్రీ.. భారీగా నిలిచిపోయిన ఏపీ లారీలు! - Paddy loaded lorries stopping at pulluru toll-plaza

పుల్లూరు టోల్ ప్లాజా(Pulluru toll gate) వద్ద తెలంగాణ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఆంధ్ర నుంచి తెలంగాణకు వచ్చే వరి ధాన్యం లారీలను అడ్డుకున్నారు. దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

పుల్లూరు టోల్ ప్లాజా వద్దభారీగా నిలిచిపోయిన లారీలు

author img

By

Published : Nov 25, 2021, 9:31 PM IST

రాష్ట్రానికి చెందిన వరిధాన్యం లారీలను.. తెలంగాణలోకి వెళ్లనీయకుండా ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకుంటున్నారు. కర్నూలు జిల్లాలోని తెలంగాణ సరిహద్దు పుల్లూరు టోల్ ప్లాజా వద్ద.. పోలీసులు తనిఖీలు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న ధాన్యానికి తెలంగాణ రాష్ట్రంలోకి అనుమతి లేదంటూ వెనక్కి పంపిస్తున్నారు. ఈ పరిణామంతో ఏపీకి చెందిన రైతులు ఆవేదన చెందుతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా.. ఇలా నడిరోడ్డుపై లారీలను ఆపడం సరికాదని వాపోయారు. పోలీసుల అడ్డగింతతో టోల్​గేట్ వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి.

ఇదీచదవండి.

Tirumala Tickets: ఈనెల 27న తితిదే ఉచిత సర్వదర్శనం టికెట్లు విడుదల

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.