OPEN AIR THEATRE DEMOLITION: కర్నూలు నగరం నడిబొడ్డున, కొండారెడ్డి బురుజు ఎదురుగా ఉన్న బాబూ జగ్జీవన్ రాం ఓపెన్ ఎయిర్ థియేటర్.. 1978 నవంబర్ 16న అందుబాటులోకి వచ్చింది. ఈ వేదికపై ఎన్నో పౌరాణిక, సాంఘిక నాటకాలు ప్రదర్శితమయ్యాయి. ఇక్కడ నటించినవారిలో.. ఎందరో గొప్ప గొప్ప కళాకారులయ్యారు. అప్పట్లో నాటకం ఉందంటే.. ఓపెన్ ఎయిర్ థియేటర్ నిండిపోయేది. తరచుగా.. రాజకీయ పార్టీల బహిరంగ సభలూ జరిగేవి. రాష్ట్ర, జాతీయ నాయకులు సైతం.. ఈ వేదిక నుంచి ప్రసంగించిన చరిత్ర ఉంది. అంతటి చారిత్రక నేపథ్యాన్ని కూల్చివేయడం సరికాదని కళాకారులు వాపోతున్నారు.
కర్నూలు నగరపాలక సంస్థ నిర్వహిస్తున్న ఈ థియేటర్ ను ఆనుకుని.. 50 కి పైగా దుకాణాలు ఉన్నాయి. వీటి నుంచి.. ప్రతి నెలా అద్దెలు వస్తున్నాయి. ఐనా.. థియేటర్ ను తొలగించి ఏం కడతారన్నది స్పష్టత ఇవ్వడంలేదనేవిమర్శలు వినిపిస్తున్నాయి. అధికారులు వెంటనే కూల్చివేతలు ఆపేసి ఓపెన్ ఎయిర్ థియేటర్‌ను అభివృద్ధి చేయాలని కళాకారులు కోరుతున్నారు.
ఇదీ చదవండి: