ఉల్లి ధరలు కొండెక్కి కూర్చున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో... రికార్డు ధరలు పలుకుతున్నాయి. కర్నూలు మార్కెట్‌లో క్వింటాలు ఉల్లి... గరిష్ఠ ధర 13,160 రూపాయలు పలికి చరిత్ర తిరగరాసింది. 3 రోజుల క్రితం క్వింటాలు ఉల్లి ధర 10 వేల 180 రూపాయలు పలికింది. ఇప్పుడు మరింత పెరిగి 13 వేల 160రూపాయలకు చేరింది. ఉల్లి సామాన్యులను తిప్పలుపెడుతోంది.
ఇదిలా ఉంటే... ధర పెరుగుదల రైతుల్లో సంతోషాన్ని నింపింది. మంచి లాభాలు వస్తున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు అన్నదాతలు. గత కొన్నేళ్లుగా ఉల్లికి గిట్టుబాటు ధర లేక నిరాశకు గురయ్యామని... ఇప్పుడొచ్చిన ఊహించని ధర సంతోషాన్ని నింపిందని చెబుతున్నారు. ఉల్లి ధరలు ఒకరికి కంటనీరు తెప్పిస్తుంటే... మరొకరి కళ్లల్లోకి ఆనందాన్ని తీసుకొచ్చాయి.