ETV Bharat / city

కరోనా ఎఫెక్ట్ : ఆతిథ్య రంగం వెలవెల

కరోనా దెబ్బతో ఆతిథ్య రంగం కుదేలైంది. టిఫెన్​ సెంటర్ల నుంచి త్రిస్టార్​ హోటళ్ల వరకూ అన్నీ‌ మూతపడటంతో వీటిపై ఆధారపడిన లక్షలాది కార్మికులు ఉపాధి కోల్పోయి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. కరోనా లాక్​డౌన్​ వల్ల కర్నూలు జిల్లాలో రెండు నెలలకుపైగా హోటళ్లు మూతపడే ఉన్నాయి. ప్రభుత్వం సాయం చేస్తేనే కోలుకునే పరిస్థితి ఉందని యాజమాన్యాలు అంటున్నాయి.

ఆతిథ్య రంగం వెలవెల
ఆతిథ్య రంగం వెలవెల
author img

By

Published : Jun 1, 2020, 4:25 PM IST

కర్నూలు జిల్లాలో హోటల్‌ పరిశ్రమ మూడు టిఫిన్లు, ఆరు భోజనాలు అన్నట్లుగా సాగేది. ప్రముఖ పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాలు సహా చెన్నై, హైదరాబాద్‌, బెంగళూరు, అమరావతికి సమాన దూరంలో జిల్లా ఉండటం వల్ల పర్యాటకులు, యాత్రికులు అధిక సంఖ్యలో జిల్లాలోని వివిధ ప్రాంతాలకు వచ్చేవారు.

జిల్లాలో టిఫిన్‌ సెంటర్ల నుంచి పెద్ద హోటళ్ల వరకు సుమారు 3700 వరకు ఉన్నాయని అంచనా. కర్నూలు నగరంలో చిన్నా, పెద్ద హోటళ్లు కలిపి మొత్తం 328 వరకు ఉండగా, నంద్యాలలో 200, ఆదోనిలో 120, ఎమ్మిగనూరు 30, డోన్‌ 30, ఆత్మకూరు 20, ఆళ్లగడ్డ 20, నందికొట్కూరు 15, కోవెలకుంట్ల 10, గూడూరు 10, పత్తికొండ 10, బేతంచర్లలో 10 వరకు ఉన్నాయి. కర్నూలు, నంద్యాలలో త్రిస్టార్‌ సౌకర్యాలతో హోటళ్లు నడుస్తున్నాయి. ఇవన్నీ లాక్‌డౌన్‌తో మూతపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా కనీసం టీ స్టాళ్లు సైతం తెరచుకోని పరిస్థితి ఏర్పడింది.

జిల్లా వ్యాప్తంగా లాక్‌డౌన్‌తో సుమారు 70 కోట్లకు పైగా అతిథ్య‌ రంగం నష్టపోయింది. రోజుకు సగటున కోటి రూపాయల వరకు వ్యాపారం జరిగేదని నిర్వహకులు చెబుతున్నారు. కర్నూలు నగరంలోని వెంకటరమణ కాలనీ, శ్రీనివాసనగర్‌, ఆర్టీసీ బస్టాండు, పెద్దాసుపత్రి, కలెక్టరేట్‌, కొండారెడ్డి బురుజు, సీ క్యాంప్‌, నందికొట్కూరు చౌరస్తా, బళ్లారి చౌరస్తాల్లో హోటళ్లు అధికంగా ఉన్నాయి.

నంద్యాల పట్టణంలోని బ్యాంకు శిక్షణ కేంద్రాలకు నిలయమైన ఎన్జీవో కాలనీ సహా ఎస్బీఐ కాలనీ, నూనెపల్లె, బొమ్మలసత్రం, ఆసుపత్రి, శ్రీనివాసనగర్‌, సంజీవనగర్‌, ఆర్టీసీ బస్టాండు ప్రాంతాల్లో హోటళ్ల వ్యాపారం బాగా జరిగేది. లాక్​డౌన్ కారణంగా ఇవన్నీ మూతపడ్డాయి.

హోటళ్లు తిరిగి ప్రారంభమైనా.. మునుపటి పరిస్థితి ఉంటుందనే నమ్మకం లేదని హోటల్ వ్యాపారులు అంటున్నారు. నిర్వహణ భారం తగ్గించుకునే క్రమంలో గతంలో పనిచేసే వారందరికీ ఉపాధి కల్పించలేకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు.

లాక్‌డౌన్‌ ప్రభావంతో హోటళ్ల యాజమాన్యం, కార్మికులు బాగా దెబ్బతిన్నారు. తిరిగి కోలుకోవాలంటే ఆరు నెలల సమయం పడుతుందని హోటళ్ల యాజమానులు అంటున్నారు. వలస కూలీలు స్వస్థలాలకు వెళ్లి పోవటం వల్ల కార్మికుల కొరత ఏర్పడుతుందని చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంఎస్‌ఎంఈ హోదా కలిగిన సంస్థలకు రాయితీలు, రుణ సౌకర్యాలు కల్పిస్తున్నాయి. తమను కూడా ఈ తరహాలో ఆదుకోవాలని వ్యాపారులు కోరుతున్నారు.

ఇదీ చదవండి : సచివాలయంలో ఉద్యోగికి కరోనా..అప్రమత్తమైన అధికారులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.