ETV Bharat / city

Bharat Jodo: అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా: జైరాం రమేష్ - special status to andhra pradesh

Jairam Ramesh: రాహుల్ గాంధీ చెపట్టిన భారత్ జోడో యాత్ర ఈ నెల 18 నుంచి 21 వరకు రాష్ట్రం​లోని కర్నూలు జిల్లాలో కొనసాగనుంది. ఇందుకోసం కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ జిల్లాలోని సన్నాహక కార్యక్రమాలను పరిశీలించారు. కార్యకర్తలు, నాయకులతో సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మెుదటి సంతకం ప్రత్యేక హోదాపైనే ఉంటుందని హామీ ఇచ్చారు. కర్నులు జిల్లాలో రాహుల్ పాదయాత్ర నాలుగు రోజులు కొనసాగుతుందని వెల్లడించారు. ఈ యాత్ర 95 కిలోమీటర్ల మేర సాగుతుందని జైరాం రమేష్ పేర్కొన్నారు.

Jairam Ramesh
Bharat Jodo Yatra in Kurnool
author img

By

Published : Oct 4, 2022, 4:53 PM IST

Bharat Jodo Yatra in Kurnool:2024లో కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తుందని.. ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ స్పష్టం చేశారు. మొదటి సంతకం ప్రత్యేక హోదాపైనే తమ ప్రధాని పెడతారని హామీ ఇచ్చారు. రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర కర్ణాటక నుంచి ఈనెల 18న కర్నూలు జిల్లాలోకి ప్రవేశిస్తుందన్నారు. ఈ నెల 21 వరకు నాలుగు రోజులపాటు జిల్లాలో 95 కిలోమీటర్ల మేర యాత్ర సాగుతుందన్నారు. యాత్ర సన్నాహకాలపై కర్నూలులో కార్యకర్తలు, నాయకులతో.. ఉమెన్‌ చాందీ, ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, శైలజానాథ్‌, పళ్లంరాజు, హర్షకుమార్‌తో కలిసి వారు సమావేశం నిర్వహించారు.

కర్నూలు జిల్లా నాయకులతో జైరాం రమేష్

దేశంలో ఆర్థిక, సామాజిక అసమానతలు తీవ్రంగా పెరిగిపోతున్నాయన్న నేతలు.. వాటి నుంచి మళ్లీ ప్రజలను కాపాడుకునేందుకే జోడో యాత్ర చేపట్టినట్లు తెలిపారు. కేసీఆర్‌ది బీఆర్ఎస్‌ పార్టీ కాదని 2024లో వీఆర్ఎస్‌ తీసుకుంటుందని జోస్యం చెప్పారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.