అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. కంబదూరు, కుందుర్పి మండలాల్లో అధికంగా వర్షాలు కురవడంతో పలు చెక్ డ్యాంలు, కాలువలు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. ఈ వర్షాలతో భూగర్భ జలాలు పెరుగుతాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కొన్నిచోట్ల ఇళ్లలోకి నీరు ప్రవేశించగా.. కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కర్నూలు జిల్లాలో..
కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం పసుపల గ్రామ సమీపంలో భారీ వర్షానికి ప్రధాన రహదారి వంతెన కుంగిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న బనగానపల్లి ఎస్సై శంకర్ నాయక్ సిబ్బందితో వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. వాహనాల రాకపోకలను, ప్రయాణికులను వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు.
ఇదీ చదవండి: thunder: పిడుగుపాటుకు కానిస్టేబుల్ మృతి